బ్రహ్మోస్ ఎయిర్ వెర్షన్.. ఇక చైనాకు వణుకే!

0
19
ప్రపంచంలోనే తొలిసారిగా భారత్ అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఎయిర్ వెర్షన్‌ పరీక్షలకు సిద్ధమైంది. ఇప్పటికే దీనిని సుఖోయ్ యుద్ధ విమానానికి విజయవంతంగా అనుసంధానం చేసిన అధికారులు టెస్ట్ ఫైర్‌కు సిద్ధమవుతున్నారు. బ్రహ్మోస్ క్షిపణిని ఇప్పటికే భూతలం నుంచి, సముద్రం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు నింగి నుంచి పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరీక్ష కనుక సిద్ధమైతే ప్రపంచంలోనే ఇలాంటి క్షిపణి వ్యవస్థ ఉన్న తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది.
జూన్‌లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని యుద్ధ విమానం నుంచి పరీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత రెండుసార్లు సుఖోయ్ నుంచి సాధారణ పరీక్షలు నిర్వహించాక లైవ్ టార్గెట్ పరీక్ష నిర్వహించనునట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. భారత్-రష్యాలు కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ క్షిపణి తయారీలో ఉపయోగించారు. తక్కువ దూరంలోని లక్ష్యాలను శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా తుత్తినియలు చేసే సామర్థ్యం బ్రహ్మోస్ సొంతం. బ్రహ్మోస్‌ను చూసి ఇప్పటికే చైనా, పాక్‌లు వణుకుతున్నాయి. ఇక ఎయిర్ వెర్షన్ కూడా సిద్ధమైతే ఆ రెండు దేశాలకు కంటిమీద కునుకు దూరమైనట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here