వచ్చేసారి వృద్ధి 7 శాతం ఎగువనే!

0
19

వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2017-18) వృద్ధిరేటు 7 శాతం ఎగువనే నమోదుకానుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి (2016-17) వృద్ధి రేటు కోసం మార్చి చివరివరకు వేచి చూడాల్సిందే. వచ్చేసారి మాత్రం ఏడు శాతం మించుతుంది అని ఆయన పేర్కొన్నారు. వృద్ధిపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని, వచ్చే ఆర్థిక సంవత్సరం అభివృద్ధిపై మాత్రం ప్రభావం చూపబోదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవీల వాటా గణనీయంగా పెరిగిందన్నారు.

LEAVE A REPLY