వందశాతం వినోదం

0
20

వినూత్న కథాంశాలతో సినిమాల్ని రూపొందిస్తుంటారు మోహనకృష్ణ ఇంద్రగంటి. గత ఏడాది జెంటిల్‌మెన్‌తో చక్కటి విజయాన్ని అందుకొన్న ఆయన తాజాగా అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.నరసింహారావు నిర్మించనున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్‌కొట్టగా, వినయ్ కెమెరా స్విఛాన్ చేశారు. తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ నేడు రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నాం. విభిన్న కథతో ఆద్యంతం కొత్తదనంతో ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని అందిస్తుంది అన్నారు. నవ్యమైన ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి చెప్పారు. ఈ సినిమాలో ఇషా, అదితిమ్యానికల్ కథానాయికలుగా నటిస్తుండగా, వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ల భార్గవ్, తడివేలు తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here