వందలసార్లు మాటమార్చిన బీజేపీ

0
5

జాతీయస్థాయిలో కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమున్నదని కవిత అన్నారు. బీజేపీ ఎన్నో మాటలు చెప్పి ఐదేండ్ల క్రితం కేం ద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేండ్లలో ఏం మార్చిందంటే.. ఒకసారి నో ట్లు మార్చారు.. ఒకసారి ట్యాక్స్ మార్చారు.. వం దలసార్లు మాట మార్చారు అని ఎద్దేవాచేశారు. ప్రజలకేకాదు ఆఖరికి దేవుడికే టోపీపెట్టే పార్టీ బీజేపీ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి రాముడి గుడి గుర్తుకువస్తుందని విమర్శించారు. దేశభక్తి గురించి బీజేపీ మాటిమాటికీ ప్రస్తావిస్తున్నదన్న కవిత.. బీజేపీ కంటే సీఎం కేసీఆర్‌కే ఎక్కువ దేశభక్తి ఉందన్నారు. పుల్వామా అమరజవాన్ల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఆర్థికసాయం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయలేదన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here