వంగవీటి రాధాతో రామ్‌గోపాల్‌వర్మ భేటీ

0
23

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ భేటీ అయ్యారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘వంగవీటి’ సినిమా వాస్తవాలకు విరుద్ధంగా తీస్తున్నారని ఆరోపిస్తూ రాధాకృష్ణ హైకోర్టులో వాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. సెన్సార్‌బోర్డు నుంచి అనుమతి లేకుండా విడుదల చేసిన సినిమా ట్రైలర్‌, టీజర్లను అంతర్జాలం నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రామ్‌గోపాల్‌వర్మ విజయవాడ వెళ్లి రాధాకృష్ణను కలిశారు.

LEAVE A REPLY