లోక్‌సభ ఉపఎన్నికల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ

0
7

మహారాష్ట్రలోని భండారా-గోండియా లోక్‌సభ ఉపఎన్నికల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి హేమంత్ పాట్లేపై ఎన్సీపీ నేత మధుకర్ 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ నానా పటోలే ఆపార్టీకి రాజీనామా చేసి, ఎంపీ పదవి నుంచి తప్పుకోవడంతో ఇక్కడ ఉపఎన్నికలు జరిగాయి.

కర్ణాటక రాజకీయ పరిణామాలతో పాటు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో… పాల్‌గఢ్, భండారా-గోండియాలో జరిగిన ఉపఎన్నికలను బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోమవారం జరిగిన పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపీఏటీ మెషీన్లలో లోపాలు తలెత్తాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గంలోని మొత్తం 49 బూత్‌లలో నిన్న మళ్లీ పోలింగ్ నిర్వహించారు. కాగా పాల్‌గఢ్‌లోనూ ఇదే తరహా ఫిర్యాదులు వచ్చినప్పటికీ రీపోలింగ్ నిర్వహించలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గోవిత్ 29,572 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

LEAVE A REPLY