లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్

0
22

:ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఫార్మా రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటుతో ఆ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం శామీర్‌పేట జీనోమ్‌వ్యాలీలో మంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 200 ఫార్మా కంపెనీలు, 10వేల మంది ఉద్యోగులతో జీనోమ్ వ్యాలీ ఆసియాలోనే అతిపెద్ద క్లస్టర్‌గా, లైఫ్ సైన్సెస్ పరిశోధనల కేంద్రంగా మారిందని చెప్పారు. నోవార్టీస్, జీఎస్కే, లోన్జా వంటి దిగ్గజ కంపెనీలు జీనోమ్ వ్యాలీలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఐ ల్యాబ్‌ను ప్రారంభించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ చైర్మన్ ఫాల్స్ టోఫెల్‌కు విజ్ఞప్తి చేశారు.

పలు సంస్థలకు శంకుస్థాపన..

వ్యాక్సిన్ల తయారీ, పరిశోధన కోసం రూ.1700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన జియోలాజికల్ ఈ-సెజ్, ఐసీఐసీఐ ఎస్‌ఎంఈ నాలెడ్జ్ పార్కు, ఎంఎన్ పార్కు రెండోదశ, పరిశోధనలకు 20లక్షల చదరపు అడుగుల రెడీ టు ఆక్యుపైతోపాటు దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు టోఫెల్‌తో కలిసి మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.3వేల కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ 2.0 కొత్తరూపాన్ని సంతరించుకుంటుందన్నారు. జీనోమ్ వ్యాలీని త్వరలోనే ప్రత్యేక పారిశ్రామిక ఐలాగా ప్రకటించి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. లైఫ్ సైన్సెస్‌కు జీనోమ్ వ్యాలీ కేరాఫ్ అనే పేరు నిలబెడుతామన్నారు. తూంకుంట వరకు స్కైవేను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

కేటీఆర్ వంటి ముందుచూపు, ఉత్సాహం గల నాయకుడి నేతృత్వంలో తెలంగాణ ఫార్మా రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని జాన్సన్ అండ్ జాన్సన్ చైర్మన్ ఫాల్స్ టోఫెల్ అన్నారు. మంత్రి కేటీఆర్‌తో హైదరాబాద్-ఫార్మా రంగ వివరాలు, పురోగతిపై ఆయన చర్చలు జరిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బీపీ ఆచార్య, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ సౌమ్య స్వా మినాథన్, బీఈ ఎండీ మహిమ దాట్లా, ఎన్‌ఏఆర్ ఆండ్ బీఆర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సురేశ్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here