లేడీవాక్‌లో మాల్యాకు సొంత ఇల్లు

0
32

బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలకు ఎగనామం పెట్టి.. లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యా అక్కడ కూడా ఖరీదైన జీవితాన్ని గడిపేస్తున్నాడు. భారతీయుల సొమ్ముతో ఉడాయించిన మాల్యా.. లండన్‌ ’లేడీ వాక్‌‘ ప్రాంతంలో అత్యంత ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బ్రిటన్‌లోని సీరియస్‌ ఫ్రాడ్ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఓ) కూడా ధృవీకరిస్తోంది. లేడీవాక్‌లోని విల్లాను విజయ్‌ మాల్య రూ.39.7 కోట్లతో కొనుగోలు చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఓ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు సమాచారమందించింది. మాల్యాకు సంబంధించిన మరిన్ని రహస్య వివరాలను ఎస్‌ఎఫ్‌ఓ.. సీబీఐకి అందించింది. ప్రస్తుతం మాల్యా నివాసముంటున్న లేడీవాక్‌ లండన్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలోనే ఎఫ్‌-1 ఛాంపియన్‌ లూయీస్‌ హామిల్టన్‌తోపాటు మరికొందరు కోటీశ్వరులు ఇక్కడ నివాసముంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here