లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో ప్రవేశ రుసుం పెంపు

0
16

కుటుంబంతో సరదాగా గడిపేందుకు.. బంధుమిత్రులతో ఆనందంగా ఉండేందుకు పార్కులకు వచ్చే సందర్శకులకు ప్రవేశ రుసుం ఇక మరింత భారం కానుంది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) ఆధ్వర్యంలో నడుస్తున్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్, సంజీవయ్య పార్కులలో ప్రవేశ రుసుం పెంచాలని అధికారులు నిర్ణయించారు. పిల్లల ప్రవేశ రుసుంను రూ.10 నుంచి రూ.15కు, పెద్దల ప్రవేశ రుసుం రూ.20 నుంచి రూ.25కు పెంచారు. పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.

LEAVE A REPLY