లిమిటెడ్ ఎడిషన్‌గా వ్యాగన్ ఆర్

0
14

కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..దేశీయ మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్‌గా వ్యాగన్ ఆర్‌ను ప్రవేశపెట్టింది. ఎల్‌ఎక్స్, వీఎక్స్‌ఐ రెండు రకాల్లో లభించనున్న ఈ కారు ఢిల్లీ షోరూంలో రూ.4.4 లక్షల నుంచి రూ.5.37 లక్షల మధ్యలో ధరను నిర్ణయించింది. సరికొత్త టెక్నాలజీ ఫీచర్స్ కలిగిన ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో రివర్స్ చేసేటప్పుడు వెనుకవైపు ఉన్న వాహనాలకు సంబంధించి సమాచారం ఇవ్వడంతోపాటు శబ్దం కూడా చేయనున్నదని మారుతి ఈడీ(మార్కెటింగ్) ఆర్‌ఎస్ కల్సీ తెలిపారు. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాగన్ ఆర్‌లో సరికొత్త మోడల్‌ను తీసుకరావడం సంతోషంగా ఉందన్నారు. పెట్రోల్, సీఎన్‌జీ రకాల్లో సంస్థ ఆఫర్ చేస్తున్నది.

LEAVE A REPLY