లాస్‌ ఏంజిల్స్‌

0
61

స్కార్‌ వేడుక జరుగుతున్నప్పుడల్లా లాస్‌ ఏంజెలెస్‌ కాస్తా… లాట్‌ ఆఫ్‌ ఏంజెల్స్‌గా మారిపోతుంటుంది. బ్రహ్మదేవుడు బంపర్‌ ఆఫర్‌ కింద స్వర్గం నుంచి అప్సరసల్ని గుంపగుత్తగా భూమ్మీదకు అదీ లాస్‌ ఏంజెలెస్‌కు కానుకగా పంపినట్టు అనిపిస్తుంటుంది. ఆ క్షణమే రెండు కళ్లు కాస్తా రెండు వేలైపోతే బాగుణ్ణు అనే అత్యాస కలిగేలా చేస్తుంది. ఈ రెండు కళ్లతో ఎంతమందిపైనని ఫోకస్‌ పెట్టగలం…? ఆస్కార్‌ ప్రతిమల కంటే ముద్దుగా, తమపై పడుతున్న రంగురంగుల విద్యుత్‌కాంతులకంటే వెయ్యిరెట్లు శోభాయమానంగా ఈ కాంతలు వెలిగిపోతుంటారు. కళ్లు ఝిగేల్‌మనిపించే వస్త్రధారణ, స్టైల్‌కే స్పెల్లింగు నేర్పే సోగయాలు, ట్రెండ్‌కి అర్థం చెప్పే అలంకరణ… ఓహ్‌.. ఆస్కార్‌ ప్రతిమని అందుకోకపోయినా… ఆ సొగసుల్ని చూడ్డానికైనా లాస్‌ ఏంజెలెస్‌ వెళ్లాల్సిందే అని సినిమావాళ్లు ఫిక్సయిపోవడం తప్పేం కాదుగా. ప్రతీ యేటా.. ఎవరికి ఎన్ని ఆస్కార్లు వచ్చాయి? అనే పాయింట్‌ ఎంత ట్రెండ్‌ అవుతుంటుందో… ఎవరు ఎలాంటి వస్త్రధారణతో, ఎవరెలాంటి ఫ్యాషన్‌తో ఆకట్టుకొన్నారన్నదీ అంతే ట్రెండింగ్‌ అవుతుంటుంది. సుందరాంగులు కూడా ఒకరితో ఒకరికి పోటీ అన్నట్టుగా, ఈరోజే తమలోని అందమంతా చూపించేయాలన్న ఏకైక లక్ష్యంతో ముస్తాబై మురిపించేస్తుంటారు. ఈసారి ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో కనిపించిన సుందర చిత్రాలివి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here