లాంచీ ప్రమాదానికి గల కారణాలు

0
9

బోటు ప్రమాదస్థలికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. లాంచీ ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబసభ్యులు, బాధితులను ఓదార్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి- మంటూరు మధ్య ప్రమాదానికి గురైన లాంచీ 40 అడుగుల లోతున ఇసుకలో కూరుకుపోయింది. పోలవరం ప్రాజెక్టు పనుల నుంచి తెచ్చిన భారీ క్రేన్‌ల సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లాంచీని ఒడ్డుకు చేర్చాయి. మరోవైపు గల్లంతయినవారి కోసం గజ ఈతగాళ్లు నదిని జల్లెడపట్టారు. లాంచీ అద్దాలు, కిటికీలు పగులగొట్టి మృత దేహాలను వెలికి తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

LEAVE A REPLY