లక్షణమైన రక్షణ బంధం

0
52

 అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పగ్గాలు చేపట్టేముందే భారతదేశాన్ని అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించే ప్రక్రియ జోరందుకుంది. దీనికి సంబంధించిన జాతీయ రక్షణ ప్రాధికరణ చట్టానికి అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఉభయ సభలూ ఆమోదముద్ర వేశాయి. దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభ ఈ బిల్లును 375-34 ఓట్లతో ఆమోదించగా, ఎగువ సభ సెనెట్‌ 92-7 ఓట్లతో సమ్మతి తెలిపింది. పాలక, ప్రతిపక్షాలు (డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు) రెండూ సై అనడం వల్లే బిల్లు ఇంతటి భారీ మెజారిటీతో నెగ్గింది. అమెరికా అధ్యక్షుడు సంతకం చేయగానే అమలులోకి వచ్చే ఈ చట్టం- జపాన్‌, ఆస్ట్రేలియా, నాటో దేశాలతో సమాన హోదాను భారత్‌కు అందిస్తుంది. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఒకవేళ బిల్లును ‘వీటో’ చేసినా ఉభయ సభలూ అత్యధిక మెజారిటీతో బిల్లును ఆమోదించాయి కాబట్టి, అధ్యక్షుడి నిర్ణయాన్ని తోసిపుచ్చే అధికారం వాటికి ఉంది. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రక్షణమంత్రి ఏష్టన్‌ కార్టర్‌లు భారత్‌ను అత్యంత సన్నిహిత సైనిక నేస్తంగా మార్చుకోవడానికి ఎనిమిదేళ్లుగా చేసిన కృషి ఫలితమే ఈ చట్టం. దీని గురించి భారత ప్రభుత్వం పార్లమెంటుకు తెలపక పోవడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here