లక్షణమైన అబ్బాయ్‌

0
27

ల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎమ్‌.ఎల్‌.ఎ’. మంచి లక్షణాలున్న అబ్బాయ్‌… అనేది ఉపశీర్షిక. కాజల్‌ కథా    నాయిక. ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ‘‘ఇంటిల్లి పాదినీ అలరించే చిత్రమిది. ‘పటాస్‌’    తరహాలో ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. పేరుకు తగ్గట్టుగానే కల్యాణ్‌రామ్‌ తెరపై   లక్షణంగా కనిపిస్తాడ’’ని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ళ, సంగీతం: మణిశర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here