ర‌ష్యాపై క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ ఒబామా

0
35

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌ష్యా రాయ‌బారుల‌ను త‌మ దేశం నుంచి వెలివేశారు. సుమారు 35 మంది రాయ‌బారుల‌ను వెన‌క్కి పంపిచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ష్యా హ్యాకింగ్‌కు పాల్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రష్యాకు చెందిన రెండు ఇంటెలిజెన్స్ సంస్థ‌ల‌పైన కూడా అమెరికా క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను విధించింది. ర‌ష్యా మిలిటరీకి చెందిన జీఆర్‌యూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ప‌నిచేస్తున్న న‌లుగురు అత్యున్న‌త స్థాయి అధికారుల‌ను కూడా వెలివేస్తూ అమెరికా నిర్ణ‌యం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here