రోదసీకి ఒకేసారి రికార్డుస్థాయిలో, సరికొత్త చరిత్ర లిఖించనున్న ఇస్రో

0
39

అంతరిక్ష ప్రయోగ చరిత్రలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఏ దేశం చేపట్టని విధంగా ఒకేసారి ఒకే రాకెట్‌తో 103 శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ కార్యాచరణను ఇస్రో చేపట్టింది. ఫిబ్రవరి తొలివారంలోఈ అరుదైన ఫీట్‌ను చేపట్టడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది. ఇస్రోకు అత్యంత నమ్మకమైన రాకెట్ పీఎస్‌ఎల్వీ-సీ37 ద్వారా వీటిని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్టు ఇస్రో తెలిపింది. ఈ 103 శాటిలైట్లలో 100 విదేశాలకు సంబంధించినవి కావడం విశేషం. వాటిలో 100 సూక్ష్మ, చిన్నతరహా శాటిలైట్లు ఉన్నాయి

LEAVE A REPLY