రోడ్డు ప్రమాదాలు స్వీడన్‌లో అత్యల్పం.. థాయిలాండ్ అత్యధికం

0
56

రోడ్డు ప్రమాదాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో ప్రమాద మృతుల లెక్కలు చూస్తే ఆందోళన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా స్వీడన్‌లో అత్యల్పంగా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య నమోదవ్వగా, థాయ్‌లాండ్‌లో అధికంగా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య పెరిగినట్టు స్పష్టం చేసింది. 2013 నుంచి 2015 వరకు స్వీడన్‌లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ప్రతి లక్ష జనాభాకు 2.8శాతంగా ఉందని పేర్కొంది. అదే థాయిలాండ్‌లో మాత్రం మృత్యుల సంఖ్య ప్రతి లక్ష జనాభాకు 36శాతం ఉందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇకపోతే భారతదేశంలో రోడ్డు ప్రమాద మృతులసంఖ్య ప్రతి ఏటా లక్ష జనాభా ప్రతిపాధికన 16.6శాతంగా ఉందని ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

LEAVE A REPLY