రోగులకు పెనుభారంగా డాక్టర్‌ ఫీజు

0
14

కార్పొరేట్‌ వైద్యం ఖరీదని అందరికీ తెలుసు. వైద్య చికిత్సలే కాదు మినిమమ్‌ కన్సల్టెన్సీ కూడా ఇప్పుడు బహు ఖరీదుగా మారింది. సాధారణంగా ఏదైనా జబ్బు చేసినా…అలాంటి లక్షణాలు కన్పించినా ముందు రోగమేంటో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించక తప్పదు. ఇలా సంప్రదించడంతోనే కార్పొరేట్‌ దోపిడీ ప్రారంభమవుతోంది. జబ్బేంటో తెలియక ముందే రూ.500 నుంచి రూ.1000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్తే రూ.100 లేదా రూ.150 చెల్లించే వారు. అదే ఫీజుపై మరో రెండుసార్లు చెక్‌ చేయించుకొనే సదుపాయం ఉండేది. ఇప్పుడు సీన్‌ మారింది. కన్సల్టేషన్‌ ఫీజులు అమాంతం పెంచేయడమే కాకుండా…దాన్ని ఒక్కసారి చెకింగ్‌కే పరిమితం చేస్తున్నారు.

మరోసారి వైద్యుడ్ని సంప్రదించాలంటే మరో వెయ్యి సమర్పించాల్సిందే. జనరల్‌ ఫిజీషియన్‌ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే భారీగా కన్సల్టేషన్‌ ఫీజు ఇవాల్సి వస్తోంది. ఇటీవల బేగంపేటలోని ఓ ఆస్పత్రిలో డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి చికిత్స అందించినందుకు స్పెషలిస్టు ఒక విజిట్‌ కన్సల్టేషన్‌ చార్జీ రూ.7 వేలు వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్‌ల్లో సైతం డాక్టర్‌ కన్సల్టేషన్‌ చార్జీలు అమాంతం పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here