రైల్వేలో మిగిలిన టికెట్లపై 10% తగ్గింపు

0
23

రైల్వే శాఖ మరో ప్రయోగానికి సిద్ధమైంది. అమ్మకాలు కాని టికెట్లపై నజరానా ప్రకటించింది. 10శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో మిగిలిపోయిన టికెట్లపై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు ఆయా టికెట్లపై పదిశాతం తగ్గింపును అమలు చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. చార్ట్‌ప్రిపేర్ అయిన తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. వీటిని రైలు బయలుదేరే 30నిమిషాల ముందు కరెంట్ కౌంటర్లలో గానీ, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here