రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

0
16

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను సోమవారం(రేపు) ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. దుర్ఘటన జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రైలు ప్రమాదం గురించి తెలియగానే వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తున్న హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 41 మందికిపైగా  మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY