రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా నెరవేరుస్తామని సీఎం కేసీఆర్

0
30

మాట ఇస్తే వెనక్కి పోం. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ ఓర్వడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో లేదు. కాంగ్రెస్ పార్టీయే సంక్షోభంలో ఉంది. 35 లక్షల మంది రైతులకు రుణాలను మాఫీ చేస్తున్నం. రూ.17 వేల కోట్ల రుణమాఫీని ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం దేశ చరిత్రలోనే లేదు. దీంట్లో ఇప్పటికే మూడు వంతుల మొత్తాన్ని ఇచ్చేశాం. ఇంకా ఒక్కవంతు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ క్రమంలో రైతుల నుంచి ఎక్కడైనా వడ్డీ వసూలు చేస్తున్నట్లు తేలితే ఆ వడ్డీని కూడా మేమే చెల్లిస్తాం. దానికి అవసరమైన రూ.100-200 కోట్లు ఇస్తాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రుణమాఫీని నాలుగు విడతల్లో చేస్తామని తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటే ఉంటాయని, ఎక్కడ సమస్య ఉన్నా దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రతిపక్షాలకు సూచించారు. అసెంబ్లీలో వ్యవసాయం అంశంపై బుధవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. రుణమాఫీ గురించి సమగ్రంగా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here