రైట్‌ గై ఎట్‌ ది రాంగ్‌ టైం

0
23

‘పాటలు పాడటం, డ్యాన్సులు చెయ్యడంతోనే నా తొలి ఇన్నింగ్స్‌ పూర్తయింది. నటుడిగా నా సామర్థ్యం చూపించే అవకాశం ఇప్పుడు ఈ మలి ఇన్నింగ్స్‌ లోనే మొదలైంది.’ ఈ మాటలంటున్నది అలనాటి అందాల నటుడు రిషి కపూర్‌. ‘తెలిసీ తెలియని వయసులో బాబీ సినిమాలో నటించి ఫిలింఫేర్‌ వారి నుండి ఉత్తమ నటుడి బహుమతిని డబ్బుతో కొనుక్కున్నాను. ఈ విషయాన్ని దాపరికం లేకుండా నా పుస్తకంలో పేర్కొన్నాను. కానీ ఇప్పుడు మాత్రం మంచి సినిమాల్లో క్యారక్టర్‌ నటుడిగా రాణిస్తూ ఉత్తమ నటుడి బహుమతులు నిజమైన సామర్థ్యంతోనే గెలుచుకోవాలని వువ్విళ్ళూ్లరుతున్నాను’ అంటూ ఈ వెటరన్‌ నటుడు వదోదర లిటరేచర్‌ ఫెస్టివల్‌లో మనసువిప్పి మాట్లాడారు. ఆ మధ్య రిషి అగ్నిపీఠ, డి-డే, కపూర్‌ అండ్‌ సన్స్‌ సినిమాలలో పరిణితి నిండిన పాత్రల్లో రాణించారు. మరో విషయానికి వస్తే, రిషి కపూర్‌ సంధించే ట్వీట్లు కూడా కుండ బద్దలు కొట్టినట్లుంటాయి. మనసులోని మాటను చెప్పే స్వాతంత్య్రం తనకుందని, ఒక సామాన్య పౌరునిగా, పన్ను చెల్లించే వ్యక్తిగా తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తానని రిషి ఈ సందర్భంగా వదోదర యూనివర్సిటీ విద్యార్థులకు తెలిపారు. మంచి యాక్షన్‌ సినిమాలకు ఆదరణ లభిస్తున్న రోజుల్లో తను ఒక రొమాంటిక్‌ హీరోగా నటిస్తూ మనుగడ సాగించానని, అందుకు తగిన గుర్తింపు పొందడం కూడా ఆ రోజుల్లో ఒక సాహసమనే చెప్పాలి అని రిషి అభిప్రాయపడ్డారు. రాజ్‌కపూర్‌ నిర్మించిన మేరా నామ్‌ జోకర్‌, బాబీ సినిమాల ద్వారా నటన అంటే ఏమిటో తెలుసెకున్నాను అన్నారు రిషి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here