రేషన్, ఎరువుల షాపుల్లో కార్డు చెల్లింపులు

0
26

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా కేంద్ర సర్కారు ఎరువులు, రేషన్ దుకాణాల్లో క్రెడిట్/డెబిట్ కార్డుల చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. రాబోయే కొద్దిమాసాల్లో అన్ని దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) యంత్రాలు ఉండేలా చూస్తామని కేంద్ర ఆర్థిక కార్యదర్శి అశోక్ లవాసా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికే రేషన్ దుకాణాల్లో 1.7 లక్షల పీవోఎస్ యంత్రాలు ఉన్నాయని, రాబోయే మాసాల్లో మిగతా దుకాణాల్లో యంత్రాలు ఏర్పాటవుతాయని వివరించారు. ఆహార, పౌరసరఫరాల విభాగం, ఎరువుల విభాగం పీవోఎస్ కార్యక్రమాన్ని చేపట్టాయని లవాసా చెప్పారు. వాటిని ఆధార్‌తో కలుపుతారని ఆయన పేర్కొన్నారు. నాబార్డు సహాయంతో బ్యాంకులు పీవోఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు.

LEAVE A REPLY