రేవంత్‌వి అసత్య ఆరోపణలు

0
24

మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి సభలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని మండలిలో విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘ప్రభుత్వాన్ని మిషన భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో కమిషన అడిగామా..?’ అన్న రేవంత్‌ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. కమిషన్లు, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తావులేదన్నారు. గతంలో నెలపాటు జైళ్లో ఉన్న రేవంత్‌రెడ్డికి అది ప్రొబేషనరీ పిరియడ్‌ కాబోతోందని, ప్రభుత్వంపై ఆధార రహిత విమర్శలు ఆపకపోతే ఆయనను శాశ్వతంగా జైళ్లో పెట్టిస్తామని హెచ్చరించారు

LEAVE A REPLY