రేపు సీఎస్ రాజీవ్ శర్మ పదవీ విరమణ

0
23

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు మధ్యామ్నం 3 గంటలకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
కాగా, నిన్నటి మంత్రివర్గ సమావేశంలో సీఎస్ సేవలను సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. నూతనంగా ఏర్పడిన రాష్ర్టానికి మొదటి సీఎస్‌గా ఉండి అనేక కీలక సమస్యల్లో రాష్ర్టానికి ప్రయోజనం చేకూర్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆస్తులు, ఉద్యోగుల విభజన సమస్యలను పరిష్కరించడానికి ఆయన విశేష కృషి చేశారన్నారు. సర్కారు ఆలోచనలను అనుగుణంగా అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా పని చేయించారని చెప్పారు. రాజీవ్‌శర్మను ఘనంగా సన్మానించాలని నిర్ణయించారు. పదవీ విరమణ తర్వాత కూడా రాజీవ్ శర్మ అనుభవాన్ని రాష్ర్టాభివృద్ధికి ఉపయోగించుకోవాలనే అభిలాషను సీఎం వ్యక్తం చేశారు

LEAVE A REPLY