రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీష్‌రావు

0
19
రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు శనివారం వరంగల్‌ అర్బన్ జిల్లాకు వస్తున్నారు. ఉదయం హైదరాబాద్‌నుంచి బయలు దేరి ఉదయం 10 గంటలకు హన్మకొండకు చేరుకునే మంత్రి అర్బన్ జిల్లాతో పాటు మహబూబాబాద్‌ జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈనెల 27న నిర్వహించే పార్టీ ఆవిర్భావసభను పురస్కరించుకుని హన్మకొండ హంటర్‌రోడ్డు ప్రాంతంలోని సీఎస్‌ఆర్‌గార్డెన్సలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
  మధ్యాహ్న భోజనానంతరం హన్మకొండ నుంచి బయలు దేరి మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చేరుకుని మధ్యా హ్నం 4గంటలకు చేరుకుని మిషన్ కాకతీయ పనులను పరిశీలించనున్నారు. 4.20గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.30గంటలకు అనంతారం చేరుకుని సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. 4.50గంటలకు అనంతారం నుంచి బయలు దేరి సాయంత్రం 5గంటలకు మహబూబాబాద్‌ చేరుకుని అక్కడ మిస్సమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌ బయలు దేరి వెళ్లనున్నారు. హన్మకొండకు చేరుకునే మంత్రి హరీష్‌రావు ప్రకాశరెడ్డిపేటలోని బహిరంగ సభాస్థలాన్ని కూడా పరిశీలించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

LEAVE A REPLY