రేణు దేశాయ్‌కి కోపం వచ్చింది

0
24

రేణు దేశాయ్‌కి కోపం వచ్చింది. తన పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని ఈమధ్య ఆమె చేసిన వ్యాఖ్యలకు కొంతమంది నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. మరోసారి పెళ్ళి చేసుకుంటే.. మిమ్మల్ని అసహ్యించుకుంటామంటూ కొంతమంది పెట్టిన కామెంట్లు ఆమెను తీవ్రంగా బాధించాయి. ‘ఇటువంటి పోస్టులు కేవలం నన్ను మాత్రమే ఉద్దేశించింది కాదు.. కానీ ఇటువంటి కామెంట్స్ చదివినప్పుడు మనం ఎటువంటి సమాజంలో వున్నాం.. ఎటువంటి మైండ్‌సెట్ వున్న మగవాళ్ల మధ్య బ్రతుకుతున్నాం అని అనిపిస్తుంది. ఒకవైపు మహిళల సమానత్వం, ఆడపిల్లల శక్తి, రేపుల నుంచి భ్రదత.. వగైరా వగైరాలంటూ మాట్లాడుతాం. ఇంకోవైపు ఏడేళ్లనుంచి నేను ఒంటరిగా వుండి.. ఇప్పుడు నాకు ఒక లైఫ్ పార్ట్‌నర్ వుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినందుకు ఈ హేట్ మెసేజెస్ పంపుతున్నారు. మన దేశంలో ఒక మగాడు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు కానీ ఒక అమ్మాయి మాత్రం ఇంకో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పు. జీవితాంతం ఇలాంటి ఫీలింగ్స్‌తో ఒంటరిగా బతకాలా?’ అంటూ రేణు ప్రశ్నించింది. ‘ఈ దేశంలో అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే.. మహిళలే వాళ్ల కొడుకుల్ని పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా ఈ మగవాళ్ల మైండ్‌సెట్‌లో మార్పు వస్తుందేమో’ అంటూ గట్టి జవాబిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here