రెవల్యూషన్ స్కేర్‌కు పోటెత్తుతున్న కాస్ట్రో అభిమానులు

0
25

క్యూబా రాజధాని హవానాలోని ప్రఖ్యాత రెవల్యూషన్ స్కేర్ ప్రాంతానికి సోమవారం జనం పోటెత్తారు. అక్కడి ప్రఖ్యాత క్యూ బన్ నేషనల్ లైబ్రరీ భవనంపై తుపాకీ పట్టుకొని నిల్చున్న కాస్ట్రో చిత్రపటాన్ని వేలాడదీశారు. శుక్రవా రం మరణించిన క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో రెవల్యూషన్ స్కేర్ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రజలను కలుసుకొనేవారు. ఈ ప్రాంతం నుంచే ఎ న్నో ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేశారు. అమెరికా ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్యూబా పర్యటనలో సైతం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. కాస్ట్రో అస్థికలను ప్రజల సందర్శనార్థం ఎక్కడ భద్రపరుచనున్నారనేది మాత్రం అధికారులు ఇప్పటికీ చెప్పడం లేదు…..

LEAVE A REPLY