రెడ్డిగారు.. జయసింహా..

0
32

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ఓ కొలిక్కి వచ్చేట్టే ఉంది. ఈమధ్య చాలా కథలు విన్న బాలయ్య… అందులో ఓ కథని ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల తమిళ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ బాలయ్యకు ఓ కథ వినిపించారు. అది ఆయనకు బాగా నచ్చిందని, ఆ చిత్రంలో నటించడానికి పచ్చజెండా వూపారని తెలుస్తోంది. సి.కల్యాణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. కథానాయికగా తమన్నా పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ‘రెడ్డిగారు’, ‘జయసింహా’ అనే పేర్లు బయటకు వచ్చాయి. ‘సింహా’ అనే టైటిల్‌ బాలయ్యకు బాగా కలిసొచ్చింది. ‘రెడ్డిగారు..’ కూడా కొత్తగానే అనిపిస్తోంది. మరి ఈ మూడింటిలో ఏది ఖరారు చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here