రెండేండ్ల తర్వాత పచ్చబడ్డ తెలంగాణ

0
20

:రెండేండ్లపాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడిన తెలంగాణ రైతాంగం.. గత వానాకాలంలో సాధారణ స్థాయికి మించి సమృద్ధిగా కురిసిన వర్షాలు.. ఫలితంగా నిండుకుండల్లా మారిన జలాశయాలు ఇస్తున్న భరోసాతో పెద్ద ఎత్తున యాసంగి సాగుకు సిద్ధమవుతున్నది. వానాకాలం పంటను మించి.. సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండేండ్లపాటు సరైన వర్షాలు లేవు. అయినా ప్రకృతిపై నమ్మకంతో రైతులు సాగుకు దిగారు. అందుకే 2014 వానాకాలం పంట కింద సాధారణ సాగు (40.37 లక్షల హెక్టార్ల)లో 96% సాగు చేశారు. వర్షాలు లేక, భూగర్భ జలాలు అందుబాటులోకి రాక.. సమైక్య రాష్ట్ర పాలకులు చేసిన నిర్వాకంవల్ల విద్యుత్తు సరఫరాలో లోటుపాట్లతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. 2015లో కరువు, వర్షాభావ పరిస్థితులతో వానాకాలం పంట సమయంలో రైతులు ఒకడుగు వెనుకకు వేశారు. దీనితో సాధారణం (41.43 లక్షల హెక్టార్లు) కంటే 86% మాత్రమే సాగైంది. 2016లో వర్షాలు బాగా పడటంతో.. సాధారణంలో 89 శాతం సాగయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here