రెండు రాష్ట్రాలకిచ్చింది రూ.900 కోట్లే

0
16

అమరావతి: పెద్ద నోట్ల రద్దు అనంతరం పల్లెటూళ్లు నగదు కోసం కటకటలాడుతున్నాయి. అక్కడ ప్రజలకు ఆసరాగా ఉండే గ్రామీణ బ్యాంకులను ప్రధాన బ్యాంకర్లు, రిజర్వు బ్యాంకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ బ్యాంకుల అవసరాలకు తగ్గటు నగదు పంపక పోవడంతో కనీసం పింఛన్లూ సక్రమంగా పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా ఐదు గ్రామీణ బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు-ఆర్‌ఆర్‌బీ) కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 2100 గ్రామీణ బ్యాంకుల శాఖలుండగా.. ఏపీలో వీటి సంఖ్య 1125. ప్రస్తుతం ఈ బ్యాంకులకు దాదాపు రెండు కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. గ్రామాల్లోని రైతులు, వ్యసాయ కూలీలు, పింఛనుదారులు ఎక్కువగా ఈ బ్యాంకులపైనే ఆధారపడుతుంటారు. అయితే, ఈ బ్యాంకులకు తగినంత నగదు రిజర్వు బ్యాంకు నుంచీ అందకపోవడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు సతమతమవుతున్నారు.

LEAVE A REPLY