రెండు చోట్ల నుంచి ముఖ్యమంత్రి పోటీ

0
17

ఉత్తరాఖండ్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ 63 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆదివారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. హరిద్వార్ రూరల్, కిచ్చా ఏరియాల నుంచి ఆయన పోటీ చేస్తుండగా, పార్టీ సీనియర్ నేత కిషోర్ ఉపాధ్యాయ సహస్‌పూర్ నుంచి, మరో ప్రముఖ నేత ప్రసాద్ నైథాని దేవ్‌ప్రయోగ్ నుంచి పోటీ పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 15న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మార్చి 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

LEAVE A REPLY