రెండువేల నోటు రద్దు చేయబోం!

0
15

నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2000 నోటును ఉపసంహరించుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.12 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు. పాతనోట్ల రద్దు తర్వాత డిసెంబర్ పదినాటికి సుమారు రూ.12.44 లక్షల కోట్ల మేరకు బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలిపారు. మరోవైపు త్వరలో రూ.10 ప్లాస్టిక్‌నోట్లను విడుదల చేస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY