రూ.170 కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి

0
16

వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు జగన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. జగన్‌ కంపెనీలకు చెందిన రూ.170 కోట్ల నగదు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సొంతం చేసుకుంది. ఆ మొత్తాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకుంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో 2014 నుంచి పలు దఫాలుగా ఈడీ ఆయన కంపెనీలకు చెందిన స్థిర, చరాస్తులను జప్తు (అటాచ్‌మెంట్‌) చేసుకుంది. వీటి మొత్తం విలువ రూ.2524 కోట్లు. ఇందులో భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.170 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తమ అకౌంట్‌లోకి బదిలీ చేస్తున్నట్లు కొద్ది రోజుల కిందటే జగన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం సొత్తు స్వాధీనం ప్రక్రియను పూర్తి చేసింది. నిజానికి… ఈడీ అటాచ్‌మెంట్‌ చేసినప్పటికీ ఆస్తులన్నీ ఆయా కంపెనీల పేరిటే ఉంటాయి.

LEAVE A REPLY