రూ.150 కోట్లతో షారూక్‌ సినిమా?

0
20

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్‌ ప్రస్తుతం రయీస్‌ సినిమా సక్సెస్‌ అయిన ఆనందంలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత షారుక్‌ ఆనంద్‌ ఎ.రాయ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా షారుక్‌ జీవితంలోనే ఓ మైలురాయిగా చెప్పుకోవాలి. ఎందుకంటే షారుక్‌ ఇందులో మరుగుజ్జు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని రూ.150 కోట్లతో రూపొందించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ సినిమాకి చాలా వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కావాలి, అది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆనంద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే షారుక్‌ని ద్విపాత్రాభినయంలో చూసి అభిమానులు సంబరపడిపోయారు. ఇక ఐదు అడుగులు ఎనిమిది అంగుళాల పొడవున్న షారుక్‌ మరుగుజ్జు వేషంలో ఎలా ఉంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here