రూ.100 కోట్ల క్లబ్‌లో ‘భైరవ’

0
21

విజయ్‌ నటించిన ‘భైరవ’ చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్‌ క్లబ్‌లో చేరింది. కోలీవుడ్‌లో ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇందులో సూపర్‌స్టార్‌తోపాటు ప్రస్తుతానికి విజయ్‌, అజిత్‌లు కూడా తమ స్టార్‌డమ్‌ను చాటుకుంటున్నారు. విజయ్‌ ఒకడుగు ముందు ఉన్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన ‘కత్తి’, ‘తుప్పాక్కి’ రెండు చిత్రాలూ రూ.100 కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టినవే. అట్లి దర్శకత్వంలోని ‘తెరి’ సినిమా కూడా రూ.100 కోట్ల కలెక్షన్‌ సాధించింది. ఇప్పుడు సంక్రాంతికి విడుదలైన ‘భైరవ’ చిత్రం కూడా చేరిందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తాజాగా 25 రోజుల మైలురాయిని దాటి ప్రదర్శితమవుతోంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.

LEAVE A REPLY