రూ.10వేల కోట్ల వెనుక కోహ్లీ బాబా?

0
20

ఐడీఎస్ పథకం కింద బానాపురం లక్ష్మణ్‌రావు ప్రకటించిన రూ.10 వేల కోట్ల వెనుక కర్ణాటకకు చెందిన కోహ్లీ బాబా గ్యాంగ్ ఉన్నట్టు రాష్ట్ర సీఐడీ బృందాలు అనుమానిస్తున్నాయి. రైస్‌పుల్లింగ్, యురేని యం, ఇరీడియం ద్వారా వేల కోట్లు సంపాదించవచ్చంటూ కోహ్లీ గ్యాంగ్ వివిధ రాష్ర్టాల్లో మోసాలకు పాల్పడింది. పిడుగు పడ్డ సమయంలో వచ్చే యురేనియం తీసి వేల కోట్లకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చని కోహ్లీ బాబాగ్యాంగ్ పలువురిని మోసగించింది. ఈ వ్యవహారంలో నాలుగు నెలల క్రితం రెండు కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు ప్రధాన సూత్రధారి గంగాధర్‌రెడ్డితో పాటు కోహ్లీ అనే బురిడీ బాబాను కటకటాల్లోకి నెట్టారు. ఈ గ్యాంగ్ ఇలాంటి మోసాలతో బాగానే కూడబెట్టినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారిస్తున్న ఐటీ శాఖకు దిమ్మతిరిగే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లక్ష్మణ్‌రావు వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన రైస్ పుల్లింగ్ కథ వెనుక కర్ణాటకకు చెందిన కోహ్లీ, గంగాధర్‌రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో సీఐడీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

LEAVE A REPLY