రూపాయి పతనంతో అన్నీ భారమే

0
19
డాలర్‌తో రూపాయి మారకం రేటు మళ్లీ గింగిరాలు తిరుగుతోంది. ఇప్పటికే 39 నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. త్వరలో ఒక డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.70 నుంచి రూ.72 వరకు పడిపోయే ప్రమాదం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థపై రూపాయి పతనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

బంగారం, వెండి

డాలర్‌ విలువ పెరుగుతుంటే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధర తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ఇప్పటికే 1183 డాలర్లకు చేరింది. దీంతో బంగారం దిగుమతులు పెరిగి కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) మళ్లీ అదుపు తప్పే ప్రమాదం ఉంది. అయితే డాలర్‌ విలువ పెరిగినంత వేగంగా రూపాయి మారకం రేటు పతనం కావడం ప్రభుత్వానికి కొంత మేర ఊరట కల్పిస్తోంది. అయినా మళ్లీ దిగుమతులు అనూహ్యంగా పెరగడం ప్రారంభిస్తే కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు దేశంలో పెద్దగా తగ్గక పోవచ్చు.

LEAVE A REPLY