రుతుక్రమంపై మూఢనమ్మకం.. చలిలో బాలిక బలి

0
27

రుతుక్రమంపై కొన్నిజాతుల్లో ఉన్న మూఢనమ్మకం బాలిక ప్రాణం తీసింది. చౌపాడి ఆచారం నేపాల్‌లో 15 ఏండ్ల బాలికను బలిగొన్నది. రుతుక్రమంలో ఉన్న తొమ్మిదో తరగతి చదివే బాలికను ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో చలిని తట్టుకోలేక చనిపోయింది. బహిస్టు రోజుల్లో మహిళలు ఇంట్లో కాకుండా బయట ఒంటరిగా ఉండాలనే చౌపాడి ఆచారం దక్షిణాసియాలో పలుప్రాంతాల్లో ఆనాదిగా వస్తున్నది.
రుతుక్రమంలో ఉన్న బాలికను ఇంటి నుంచి శనివారం రాత్రి కుటుంబసభ్యులు బయటకు బలవంతంగా పంపించారు. రాత్రంగా చలిలో ఒంటరిగా గడిపిన బాలిక తెల్లవారే సరికే మృతిచెందింది. ఆదివారం ఉదయం బాలిక మృతదేహాన్ని చూసిన తండ్రి రోషని కుప్పకూలిపోయాడు. వేడి కోసం ఎలాంటి మంట కూడా వేసుకోకపోవడంతో చలిని తట్టుకోలేక బాలిక చనిపోయినట్టు స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు. సమీప గ్రామంలో ఓ మహిళ చనిపోవడంతో ఈ మూఢ ఆచారానికి చరమగీతం పాడాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY