రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేసి అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ పదవీ ప్ర మాణం

0
30

రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేసి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన వివాదాస్పద బిలియనీర్ డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం పదవీ ప్ర మాణం స్వీకరించనున్నారు. అబ్రహాం లింకన్ ఉపయోగించిన బైబిల్‌పై చేతిని ఉంచి ఆయన ప్రమాణం చేస్తారు. అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నుంచి అందుకు ప్రత్యేకంగా లింకన్ బైబిల్‌ను తెప్పించారు. చరిత్రాత్మకమైన ఆ బైబిల్‌ను ఇదివరకు బరాక్ ఒబామా 2009లో, 2013లో తన ప్రమాణ స్వీకారానికి ఉపయోగించారు. అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయిస్తారు. కాగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్లారెన్స్ థామస్ పదవీ ప్రమాణం చేయిస్తారు. పెన్స్ తన ప్రమాణానికి ఇదివరకటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఉపయోగించిన బైబిల్‌ను ఎంచుకున్నారు. ప్రమాణ స్వీకారాలు పూర్తయిన వెంటనే బైబిళ్లను తిరిగి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌కు పంపిస్తారు.

LEAVE A REPLY