రిటైర్డ్‌ పోలీసులతో విజిలెన్స్ ఎన్‌ఫో‌ర్స్‌మెంట్‌!

0
31

ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలను నివారించేందుకు రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారులతో విజిలెన్స్ ఎన్‌ఫో‌ర్స్‌మెంట్‌ ఏర్పాటైంది. ఆదివారం జరిగిన సమావేశంలో కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. గతంలో పౌరసరఫరాల శాఖలో విజిలెన్స్ విభాగం ఉన్నా ఆశించిన స్థాయిలో పనిచేయక పోవడంతో రద్దుచేశారు. కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత రిటైర్డ్‌ పోలీసు అధికారులను రంగంలోకి దించారు. 31 జిల్లాలకు రిటైర్డ్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ సంపత కుమార్‌ ఆధ్వర్యంలో ఐదు ఎనఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేసినట్టు కమిషనర్‌ తెలిపారు. సంపత కుమార్‌ ఆధ్వర్యంలోని బృందాన్ని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల ఎనఫోర్స్‌మెంట్‌గా ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎనఫోర్స్‌మెంట్‌ విభాగం తమ కార్యకలాపాలపై కమిషనర్‌కు నివేదిక ఇస్తుంది. పౌరసరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టడానికి, రైస్‌మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్ల అగడాలను అరికట్టడానికి, నాణ్యతలో రాజీపడకుండా చూడడానికే విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ను ఏర్పాటు చేసినట్టు కమిషనర్‌ ఆనంద్‌ వివరించారు. ఇవి గోదాముల తనిఖీ, రవాణా కాంట్రాక్టర్ల పనితీరును పరిశీలిస్తాయి.

LEAVE A REPLY