రిజిస్ట్రేషన్‌ ఆఫీసులపై ఏసీబీ నిఘా.. సోదాలు

0
24
 స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌-రిజిస్ట్రా‌ర్లతో పాటు ఇతర అధికారులపై ప్రత్యేక నిఘా పెట్టింది. మియాపూర్‌ భూభాగోతంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమార్కులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు రంగంలోకి దిగి న ఏసీబీ బుధవారం ఏకకాలంలో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాం తాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల కా ర్యాలయాలు, ఇళ్లు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
రాష్ట్రవ్యాప్తంగా 141సబ్‌-రిజిస్ట్రా‌ర్‌ కార్యాలయాలు ఉండగా సుమారు 30 కార్యాలయాల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వారిదగ్గరున్న భూపత్రాలు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల భూ పత్రాలు సబ్‌-రిజిసా్ట్రర్ల వద్దకు ఎందుకు వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సబ్‌-రిజిసా్ట్రర్‌ కార్యాలయాల బయట స్టాంపు పేపర్లు విక్రయించేవారు దళారుల అవతారం ఎత్తినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here