రికార్డుస్థాయిలో చెరువుల కింద 15.50 లక్షల ఎకరాల సాగు

0
25

తెలంగాణ నీటిపారుదలశాఖ, వాక్ ఫర్ వాటర్ సంస్థ సంయుక్తంగా ఆదివారం బేగంపేటలోని హోటల్ హరితప్లాజాలో జల సంరక్షణ -సామాజిక బాధ్యత అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇన్ని దశాబ్దాల్లో గరిష్ఠంగా 10-11 లక్షల ఎకరాల మేర మాత్రమే సాగు జరిగింది. కానీ మిషన్ కాకతీయ మొదటి, రెండో దశ పూర్తికావడం, మంచి వర్షాలు పడినందున ఈ ఏడాది చెరువుల కింద 15.50 లక్షల ఎకరాల్లో సాగు జరుగడం రికార్డు. మిషన్ కాకతీయ మూడోదశ కింద ప్రధానంగా ఫీడర్ చానెల్స్‌ను పునరుద్ధరించి, ప్రతివర్షపు చినుకును చెరువుల్లో నిల్వగా మార్చనున్నాం. వీటితోపాటు కొత్త చెరువుల నిర్మాణం, భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువుల మరమ్మతులు చేపట్టనున్నాం. మిషన్ కాకతీయ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అద్భుతంగా ఉన్నది. ఈ కార్యక్రమ ఫలితాలు ప్రజలు అందుకోవాలంటే వర్షాలు సమృద్ధిగా కురవాలి. అందుకే తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా అడవులను 33 శాతం పెంచాలని సంకల్పించింది అని మంత్రి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here