రాహుల్ డబుల్ సెంచరీ మిస్

0
30

చెన్నై: ఓపెనర్ లోకేశ్ రాహుల్ (311 బంతుల్లో 199; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) అసమాన ప్రదర్శనకు తోడు కొత్త కుర్రాడు కరణ్ నాయర్ (136 బంతుల్లో 71 బ్యాటింగ్; 6 ఫోర్లు) నిలకడను చూపెట్టడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో కొనసాగుతున్నది. రాహుల్ రెండు కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడంతో మ్యాచ్‌కు మూడోరోజైన ఆదివారం ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 391 పరుగులు చేసింది. నాయర్‌తో పాటు విజయ్ (17) క్రీజులోఉన్నాడు. విరాట్‌సేన ఇంకా 86 పరుగులు వెనుకబడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here