రాష్ట్ర పండుగైన బోనాల ఉత్సవాలను అత్యం త ఘనంగా

0
12

రాష్ట్ర పండుగైన బోనాల ఉత్సవాలను అత్యం త ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. వచ్చే నెల 15వ తేదీన చారిత్రాత్మక గోల్కొండ కోట నుంచి ఆషాఢ మాసం బోనా లు ప్రారంభమవుతాయన్నారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో గోల్కొండ బోనాల నిర్వహణపై కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు. వచ్చే నెల 15న మధ్యా హ్నం 12 గంటలకు తొట్టెల రథం ఊరేగింపు లంగర్‌హౌస్ నుంచి ఫతేదర్వాజ, చోటాబజార్ మీదుగా గోల్కొండ కోట వరకు సాగుతుందని వెల్లడించారు. 15న గోల్కొండ కోటలోని అమ్మవారికి మొదటి బోనం, 19న రెండో బోనం, 22న మూడో బోనం, 26న నాల్గో బోనం, 29న ఐదో బోనం, ఆగస్టు 2న ఆరో బోనం, 5న ఏడో బోనం, 9న ఎనిమిదో బోనం,12న తొమ్మిదో బోనం సమర్పించనున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY