రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు

0
24

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ బ్యాంకుల లావాదేవీల నిర్వహణను పర్యవేక్షించడంతోపాటు ప్రజల సమస్యలను పరిష్కరించేలా సూచనలు చేయనున్నది. రాష్ర్టానికి ఇప్పటివరకు రూ.15,583.81 కోట్లు వస్తే.. అందులో 94 శాతం రెండువేల నోట్లున్నాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో చిల్లర సమస్య తీవ్రంగా ఉన్నదని అన్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి 40 పేజీల నివేదికను పంపింది.

LEAVE A REPLY