రాష్ట్రంలో 1.20కోట్లు స్వాధీనం

0
17

తెలంగాణ:రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో లెక్కల్లో చూపని డబ్బు రూ.1.20 కోట్లు పట్టుబడింది. ఇందులో హైదరాబాద్ నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లోనే ఐటీ శాఖ అధికారులు రూ.66 లక్షలు సీజ్ చేశారు. నల్లధనంపై దాడులు నిర్వహిస్తున్న ఐటీ శాఖ అధికారులు పక్కా సమాచారంతో ఈ నెల 16వ తేదీ రాత్రి హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ సమీపంలోనున్న ఓ అపార్టుమెంటులోని ఫ్లాట్‌లో సోదా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.36 లక్షల విలువైన కొత్త రూ.2వేల నోట్లు బయటపడ్డాయి. వీటిని సీజ్‌చేసిన అధికారులు.. ఆ మొత్తం ఎక్కడిదనే అంశంపై సమగ్ర విచారణ చేస్తున్నారు. మరో ఘటనలో ఈ నెల 17వ తేదీన నగరంలోని ట్యాంక్‌బండ్‌పై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా.. రూ.30 లక్షలు పట్టుబడ్డాయి. హోండా యాక్ట్టివాపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.30 లక్షల విలువైన రూ.2వేల కొత్త నోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటనపై కూడా విచారణ నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు.

LEAVE A REPLY