రాష్ట్రంలో వర్సిటీలు15

0
25

రాష్ట్రంలోని మొత్తం 15 యూనివర్సిటీలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా విడివిడిగా ఉన్న యూనివర్సిటీల చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, కలిపి ఒకే ఉమ్మడి చట్టాన్ని రూపొందించడంపై చర్యలు చేపట్టింది. దీనివల్ల యూనివర్సిటీల్లో పరిపాలన మెరుదుపడటంతోపాటు, వివిధ అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం సులువవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 యూనివర్సిటీలు, 8 ప్రత్యేక యూనివర్సిటీలు, ఒక ఓపెన్ యూనివర్సిటీ ఉన్నాయి. వీటన్నింటికీ వర్తించే విధంగా ఒకే చట్టాన్ని తీసుకురావటంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కోసం 10 యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్లతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గురువారం ప్రథమ సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి చట్టాన్ని రూపొందించడంలో ఉన్న సమస్యలు, ప్రయోజనాలపై వీసీలు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here