రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

0
23

చలి తీవ్రతను తట్టుకోలేక కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని హనుమాన్‌గుడి సమీపంలో నివసించే కాంట్రాక్టు అటెండర్ ఇంజమూరి తిరుపతి(54) ఆస్తమాతో బాధపడుతున్నాడు. చలి తీవ్రత తట్టుకోలేక ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారానికి చెందిన దోమల అబ్బసాయిలు(85) నాలుగు రోజులుగా పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక ఆదివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి నేత్రాలను కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు దానం చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లాలో 7.4, జగిత్యాల 10.5, నిజామాబాద్, కామారెడ్డి 12.3, పెద్దపల్లి 12.9, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ 14 నుంచి 20 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

LEAVE A REPLY