రాష్ట్రంలో గిరిజన విద్యాభివృద్ధికి కృషి

0
76

మారుమూల తండాల్లో ఉంటూ ఏండ్ల తరబడి విద్యా విజ్ఞానానికి దూరంగా ఉన్న గిరిజనుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంపై దృష్టిసారించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి యేటా విద్యావిధానాల్లో మార్పు తీసుకొస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది 51 ఎస్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ఎస్టీ విద్యాలయాల పురోగతికి సర్కారు ఆదేశాలకు అనుగుణంగా గిరిజన సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,43,724 మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మెరుగైన విద్య కోసం ఆయా విభాగాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here